Andrea Jeremiah : ఆండ్రియా జెరేమియా మంచి సింగర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా. ఈ అమ్మడు ముఖ్యంగా తమిళ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తమిళ్ ‘పుష్ప’ సినిమాలో అమ్మడు ‘ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా..’ సాంగ్ పాడి ఒక ఊపు ఊపేసింది. ఆండ్రియా తన గొంతుతో మరోసారి అమాంతం ఫేమస్ అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పిశాచి 2 అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆండ్రియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. రొటీన్ సినిమాలను చూడటానికి ఇష్టపడటం లేదు.
ఎంటర్‌టైన్‌మెంట్ కోసమైతే సినిమా థియేటర్ వరకూ వెళ్లాల్సిన పని లేదు. బుల్లితెరపై కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఇక ఓటీటీ కూడా దీనికి జతైంది కాబట్టి కొదువే లేదు. కాబట్టి దర్శకులు సైతం వైవిధ్యమైన కథా చిత్రాలను, కంటెంట్‌లతో వెబ్ సిరీస్‌లను మేకర్స్ రూపొందిస్తున్నారు. మన స్టార్స్ కూడా బోల్డ్ పాత్రలు చేయటానికి ఏమాత్రం ఆలోచించటం లేదు. అలాంటి ఓ బోల్డ్ పాత్రలో నటి ఆండ్రియా జెరేమియా నటించింది. ఈ చిత్రంలో ఆండ్రియా కొన్ని సన్నివేశాల్లో ఏకంగా నగ్నంగా నటించింది. కథలో భాగంగా వచ్చే ఆ సీన్స్‌లో ఆండ్రియా నగ్నంగా నటించాల్సిన అవసరం రావడంతో.. ఆమె నో చెప్పకుండా కథ కోసం ఈ పని చేసింది.
Andrea Jeremiah : వాటిని ఫొటోలుగానే తీశాం..
ఈ విషయాన్ని ఈ సినిమా డైరెక్టర్ మిస్కిన్ చెప్పుకొచ్చారు. అయితే అవి కేవలం కొన్ని ఫోటోల్లో మాత్రమే ఆండ్రియా నగ్నంగా నటించింది అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సీన్స్ లో నటించడానికి ఆండ్రియా పెద్ద మొత్తంలోనే డబ్బు వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. నిజానికి నగ్నంగా నటించేందుకు ఎవరూ అంత త్వరగా సాహించరు. పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కితేనే.. అది కూడా కొందరే నటిస్తారు. ‘‘పిశాచి 2లో ఆండ్రియా న్యూడ్‌గా నటించిన మాట నిజమే. అయితే వాటిని ఫొటోలుగానే తీశాం. సన్నివేశాలుగా చిత్రీకరించలేదు. ఓ లేడీ ఫొటోగ్రాఫర్ మాత్రమే ఆ ఫొటోలను తీసింది. అలా చేయటానికి ఆండ్రియా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంది’’ అని మిస్కిన్ వెల్లడించారు.