ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. సరైన అవకాశం రావాలి కానీ వారిని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కొంతమంది తమ కళని వదిలేసి ఆర్ధిక అవసరాల కోసం ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతారు. కొంత మంది మాత్రం తమ కళని సాకారం చేసుకోవడం కోసం నిరంతరం కష్టపడతారు. అలాంటి వారు చాలా తక్కువగా కనిపిస్తారు. నైపుణ్యం అనేది ఏ ఒక్కరి సొంతం కాదని కొన్నిసంఘటనలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కంట్లో పడింది. వెంటనే దానిని తన ట్విట్టర్ లో షేర్ చేశారు. గణేష్ ఉత్సవాలు దేశ వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతాయి. ఇక ఈ ఉత్సవాల కోసం గణేష్ విగ్రహాలు విరివిగా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రాలో గణేష్ నవరాత్రి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతాయి. నార్త్ ఇండియా నుంచి చాలా మంది వచ్చి గణేష్ ప్రతిమలు తయారు చేసి ఈ సమయంలో డబ్బు సంపాదిస్తారు.
His hands move with the fluency of a great sculptor. 👏🏽👏🏽👏🏽 I wonder if kids like him get the training they deserve or have to abandon their talent…? https://t.co/XzMgeg930q
— anand mahindra (@anandmahindra) August 28, 2022
కొందరు మట్టితో చేసిన గణపతి విగ్రహాలని రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇలా మట్టితో గణేష్ విగ్రహం చేయడం మామూలు విషయం కాదు. దానికి చాలా నైపుణ్యం కావాలి. ఓ చిన్న పిల్లాడు ఏదో శ్రద్ధతో మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. ఇక ఆ విగ్రహం అద్భుతంగా ఉండటంతో ఆదర్శ్ హెగ్డే అనే ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ వీడియోని చూసిన ఆనంద్ మహేంద్ర వెంటనే తన ప్రొఫైల్ లో షేర్ చేసి ఆ బాలుడిపై ప్రశంసలు కురిపించారు. ఆ బాలుడి చేతులు గొప్ప శిల్పాన్ని చెక్కే శిల్పి తరహాలో ఎంతో అద్భుతంగా కదులుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు కదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకు వీరిని ప్రోత్సహించకూడదు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేశారు. కొంత మంది ఎంత అద్భుతకంగా చేసిన ఆయన చైల్డ్ లేబర్ క్రింద పరిగణించబడతాడు. అలాంటి బాల కార్మిక వ్యవస్థని ఎంకరేజ్ చేయకండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియోని 12 గంటల్లో 5.50 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.