గత ఎపిసోడ్‌లో.. శివని కాలర్ పట్టుకుని కార్తీక్ గురించి నిలదీస్తుంది దీప. భయపడిన శివ అస్సలు నిజం చెప్పబోతుంటే.. సడెన్‌గా వచ్చిన మోనిత.. కోపంగా కార్తీక్ తనకు చూపించమంటూ లాక్కెళ్లిపోతుంది. కార్తీకేమో తన భార్య అని చెప్పుకునే ఆవిడ ప్రవర్తనతో ఇబ్బంది పడుతుంటాడు. అస్సలు ట్విస్ట్ ఏంటంటే.. కార్తీక్ భార్యగా చెప్పుకునేది మోనితనే. కార్తీక్‌కి అన్నం పెడుతూ కనిపిస్తుంది. అదే సమయంలో అస్సలు నువ్వు నా భార్యవేనా.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు. దాంతో ఏదో చెప్పి కవర్ చేస్తుంది మోనిత. అనంతరం సౌర్యని వెతుకుంటూ వెళతారు ఆనందరావు, సౌందర్య, హిమ. ఆ తర్వాత ఆగస్టు 27 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘అమ్మనాన్న వచ్చాకే ఇంటికి వస్తా. అప్పుడే హిమ మీద ఉన్న కోపం పోతుందేమో. వాళ్లిద్దరితో కలిసి వచ్చి హిమతో మాట్లాడతా. అయినా మీరు నన్ను వదిలేసి అమెరికా వదిలేసి వెళ్లిపోయారు కదా’ అని ఆనందరావుని నిలదీస్తుంది సౌర్య. అది విని.. ‘చెప్పాను కదా.. నా మాట వినకుండా వెళ్లడం వల్ల తనకి కోపం ఇంకా పెరిగింది’ అని సౌందర్యతో ఎమోషనల్‌గా అంటుంది హిమ. దాంతో సౌందర్య కూడా బాధ పడుతూ ఇప్పటికి కూడా రావొచ్చు కదా అని ప్రశ్నిస్తుంది. అదే సమయంలో సౌర్యని ఇంటికి రమ్మని రిక్వెస్టు చేస్తాడు ఆనందరావు. దాంతో. ‘నన్ను వదిలేసి వెళ్లారంటేనే నన్ను మరిచిపోయారని అర్థం. నేను రాను. ఇంకో రాసి పిలిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని సౌర్య కోపంగా చెబుతుంది. ఆనందరావు ఎంత బ్రతిమిలాడిన వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు దీప శివని మోనిత లాక్కెళ్లడం గురించి ఆలోచిస్తూ ఆటోలో వెళుతుంటుంది. కార్తీక్ దగ్గరకి వెళితే మోనితని చూసిన వెంటనే ఛీ కొట్టి పంపిస్తాడని మనసులో అనుకుంటుంది. అదే సమయంలో కారులో ఎదురుగా వస్తుంటారు సౌందర్య వాళ్లు. దాంతో ఆనందరావుకి దీప కనిపిస్తుంది. కారు ఆపి కిందకి దిగి చూసేలోపు ఆటో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏమైందని హిమ, సౌందర్య అడిగగా.. ‘మన దీప ఆటోలో వెళుతుంది’ అంటాడు. ‘లేని మనిషి ఎలా వస్తుందండి. అది భ్రమ.. నాకు కొందరూ కార్తీక్‌లానే కనిపించారు. వాళ్లు రాలేనంత దూరంలో ఉన్నారు. ఆ విషయాన్ని గ్రహించండి’ అని చెబుతుంది సౌందర్య. అనంతరం భోజనం చేయడానికి ఓ హోటల్‌కి వెళతారు.
అనంతరం.. దీప బీపీ చూస్తుంటాడు డాక్టర్ అన్నయ్య. ఆ తర్వాత శివ దొరకడం, మోనిత గురించి జరిగిన విషయం చెబుతుంది. ‘దాని వల్ల నీకు నష్టం లేదు. నిన్నే గుర్తు పట్టనివాడు.. దాన్ని ఎలా గుర్తు పడతాడు’ అని అడుగుతాడు. దాంతో ఒకవేళ గుర్తుపడితే అని అనుమానంగా అడుగుతుంది. ‘ఆ అవకాశం ఉందమ్మా.. కానీ గుర్తు పడితే తిడతాడు.. లేదా కొడతాడు. అది నువ్వు చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. అయినా.. అది గుర్తొస్తే నువ్వు గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది. అది నీకే మంచిది కదా’ అని సర్ది చెబుతాడు డాక్టర్ అన్నయ్య.
తరువాతి సీన్‌లో.. మోనిత మంచం సర్దుతూ ఉంటుంది. అక్కడే కుర్చీలో తలపట్టుకుని కూర్చున్న కార్తీక్ ఏదొ గుర్తొచ్చినట్టు దీపా అని అంటాడు. అది విని మోనిత షాక్ అవుతుంది. అదే సమయంలో.. కూర్చిలోంచి లేచిన కార్తీక్ నేను దీప అని పిలిచానా అని అడుగుతాడు.
దాంతో.. మోనిత ఏం చెప్పాలా అని ఆలోచనలో పడుతుంది. వెంటనే కార్తీక్.. ‘దీపా నిన్నే.. ఏం ఆలోచిస్తున్నావు.. మతిమరుపు నీకా నాకా. చెప్పు అంటాడు’ అంటాడు కార్తీక్. ‘నా పేరే పిలిచావు కార్తీక్.. నేనేగా ఇక్కడున్నది.. నన్నే పిలిచావు. లేకపోతే ఇంకేవరినీ పిలుస్తావు’ అంటుంది వెంటనే కవర్ చేస్తూ. ‘అవునా.. నిన్నే పిలిచానా? నీ పేరేంటీ?’ అంటాడు. మోనితకి మళ్లీ షాక్ అవుతుంది. దీప అని చెప్పాలా.. మోనిత అని చెప్పాలా అని సందిగ్దంలోనే.. మోనిత అని చెబుతుంది. దాంతో.. వచ్చి కొంచె తలపట్టమంటాడు కార్తీక్. అది విని.. ‘కొంచెం నొక్కుకుంటేనే దీప అన్నాడు. ఇంకా నేను పడితే గతం మొత్తం గుర్తొచ్చే అవకాశం ఉంది’ అనుకుంటూ ఫోన్ వచ్చినట్లు నటించి బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది మోనిత. తాను కూడా వస్తానంటాడు కార్తీక్. కార్తీక్‌కి కోపం వచ్చి ఇంతకుముందు జరిగినట్లే బయటికి వెళ్లనివ్వకపోవడం గురించి వాదన జరుగుతుంది. మోనిత ఎప్పటిలాగే ఆరోగ్యం పేరు చెప్పి కవర్ చేస్తుంది.
అనంతరం.. హోటల్లో కూర్చొని సౌర్య గురించే మాట్లాడుకుంటారు సౌందర్య, ఆనందరావు, హిమ. సౌర్య వస్తుందో రాదొనని అంటుంది హిమ బాధగా అంటుంది. దాంతో నేను ఎలాగైనా తీసుకొస్తానని సమాధాన పరుస్తుంది సౌందర్య. అనంతరం బేర్రర్‌ని పిలిచి జ్యూస్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తుంటారు. ఇంతలో అదే హోటల్ ముందు కారులో దిగుతుంది మోనిత. దీప పేరుని కార్తీక్ కలవరించడం గురించి ఆలోచిస్తుండగా.. ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. ఆటోలో వెళుతున్న దీపకి కార్తీక్ కనిపిస్తాడు. దగ్గరకి వెళ్లేలోపు కారులో వెళ్లిపోతుంటాడు. దాంతో ఆటోలో ఫాలో అవుతుంది దీప. అక్కడికి వెళ్లగా.. కార్తీక్‌తోపాటు మోనిత ఉండడంతో షాక్ అవుతుంది దీప. అక్కడ దీపని చూసి మోనిత కూడా షాక్ అవుతుంది. అది నిజమా లేక కలనా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.