పిల్లల కోసం తండ్రి ఎంత కష్టం అయినా భరించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే తాను పడుతున్న కష్టాన్ని ఏ ఒక్కరోజు పిల్లలకి తెలియనివ్వడు. అందుకే తల్లిదండ్రుల ప్రేమలో తండ్రి ప్రేమ పిల్లలకి కనిపించదు. అలాగే వారు బాగుండాలని బయటకి కఠినంగా వ్యవహరిస్తూ వారికి తెలియకుండా పిల్లలు కోరింది ఇవ్వడం కోసం ఎంత వరకైనా వెళ్తాడు. చివరికి ప్రాణాలని కూడా లెక్కచేయకుండా పిల్లల కోసం తండ్రి పని చేస్తూ ఉంటాడు. తండ్రి ప్రేమని దేనితో కూడా కొలవలేము, పోల్చలేము. ఈ విషయం చాలా మంది విషయంలో ప్రత్యక్షంగా రుజువు అవుతుంది. ఇక చాలా మంది పిల్లలకి తండ్రే రోల్ మోడల్.
Father’s love is unmatchable😭😭😭😭😭😭❤❤❤❤ pic.twitter.com/jIfeMPSf5a
— Ali amjad (@aliamjad9832) August 26, 2022
తనలా అందరికి ఆదర్శంగా బ్రతకాలని అనుకుంటాడు. అలాగే తండ్రిలా ఎదగాలని కలలు కంటాడు. ఏది ఏమైనా తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తాజాగా తండ్రి ప్రేమని ప్రత్యక్షంగా చూపించే ఒక వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఓ నదిలో అకస్మాత్తుగా వరదప్రవాహం వస్తుంది. అందులో ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారు. వెంటనే వారి తండ్రి ఆ ప్రవాహంలోకి ప్రాణాలకి తెగించి దిగాడు. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో పిల్లలు ఇద్దరినీ గట్టిగా తన చేతులతో ఒడిసిపట్టుకుని రక్షించే ప్రయత్నం చేశాడు. పిల్లల ప్రాణాలు రక్షించాలని అతి కష్టం మీద ప్రవాహ వేగానికి ఎదురునిలిచి ఒడ్డుకి వచ్చే ప్రయత్నం చేశాడు.
అలా ఒడ్డుకి చేరుకోగానే అక్కడే ఉన్న కొంత మంది వెంటనే పిల్లలని, ఆ వ్యక్తిని పట్టుకొని కాపాడారు. ఈ వీడియోని అలీ అంజీద్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే పది లక్షల మంది వీక్షించారు. ఈ సంఘటన ఒమన్ దేశంలో జరిగింది. అయితే వీడియోలో ఉన్నది పిల్లల తండ్రి కాదు. ఒక ఫోటోగ్రాఫర్ పిల్లలు ప్రవాహంలో చిక్కుకోవడం చూసి వెంటనే స్పందించి రక్షించాడు. ఈ సంఘటన స్థానికంగా ఓ పత్రికలో కూడా ప్రచురితం అయ్యింది. మరి ఈ రెండు కథనాలతో ఏది వాస్తవం అనేది తెలియాలి.