Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంత బాగో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 26వ తేదీ జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో తులసి ఇన్విటేషన్ కార్డు పై తన పేరు వేయించినందుకు ఎంతగానో మురిసిపోయి ఆనందిస్తుంది. తర్వాత సామ్రాట్ బాబాయి స్వీట్ చేసి ఇవ్వమని అడిగితే సరే చేస్తాను అంటుండగా నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అంటాడు సామ్రాట్.
తర్వాత సన్నివేశంలో నందు, లాస్యలు తులసి ఇంటికి వస్తారు. అనసూయ వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతుంది. ఆఫీస్ పని మీద తులసి తో మాట్లాడడానికి వచ్చాము అంటారు నందు,లాస్యలు. ఇంతలో అభివచ్చి డాడ్ లోపలికి రండి అని తీసుకెళ్తాడు. లాస్య తులసిపై కామెంట్లు చేస్తుంటే నా బుర్ర తినకు అంటాడు నందు.
తరువాత సన్నివేశంలో సామ్రాట్, తులసితో ఇన్విటేషన్ కార్డు ఇంటికి వచ్చి ఇద్దామనుకున్నాను కానీ మీ ఇంట్లో వాళ్ళను మీరు పిలిస్తేనే బాగుంటుంది అనిపించింది అంటే దానికి సంతోషిస్తుంది తులసి. మరొకవైపు తులసి ఇంట్లో టీ తాగుతూ లాస్య నందుతో తులసి పై కామెంట్లు చేస్తూ ఉంటుంది.
తరువాత సన్నివేశంలో ఆనందంతో తులసి ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తుంది. ఇంతలో అక్కడ నందు, లాస్యలు ఉండడం చూస్తే అనసూయ కలగజేసుకొని ఏదో ఆఫీస్ పని మీద వచ్చారమ్మా అంటే ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లావు అని లాస్య కామెంట్ చేస్తే నేనే సామ్రాట్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తులసికి ఫోన్ చేశాను అంటాడు పరమానందయ్య. నీకు చెప్పాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నేను తులసి గొప్ప ఆనందంలో ఉన్నాము మా మూడ్ చెడగొట్టకండి అంటూ ఇంట్లో అందరూ రావలసిందిగా చెబుతాడు.
అప్పుడు తులసి ఇన్విటేషన్ కార్డు చూపిస్తే అందులో తులసి పేరుతో పాటు సామ్రాట్ పేరు ఉండడం చూసి నిజంగా పెళ్లి కార్డు లాగే ఉంది అంటూ సెటైర్లు వేస్తుంది లాస్య. ఆ కార్డు చూసి అభి అసభ్యకరంగా మాట్లాడుతాడు. అప్పుడు ప్రేమ్ నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు తీయడం మానేయి అంటే తప్పేముంది అంటుంది లాస్య.
ఇలా లాస్య ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. తులసి నాకు నచ్చింది నాకు న్యాయం అనిపించింది చేస్తాను అంటే, ఇన్నాళ్లకు నా కోడలు మంచిగా మాట్లాడుతుంది అంటుంది అనసూయ. కుటుంబ సమేతంగా మనం భూమి పూజకు వెళ్లాలి అని నన్ను ఆశీర్వదించండి మామయ్య అత్తయ్య అంటుంది. తరువాత ఆ కార్డు తీసుకొని అభి చించేస్తాడు. పరమానందయ్య రేపు అంతా మనం భూమి పూజకు వెళ్తున్నాం అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చినిగినే ముక్కలను తీసుకొని తులసి కూడా వెళ్ళిపోతుంది.
సన్నివేశంలో సామ్రాట్ ఇంకా బాబాయిలు స్వీట్ తినుకుంటూ తులసి గురించి మాట్లాడుకుంటారు. తర్వాత నీ పెళ్లి సంగతేంటి అని ప్రశ్నించిన బాబాయితో సామ్రాట్ నేను నా గురించి కాదు హానీ గురించి ఆలోచిస్తున్నాను. వచ్చిన అమ్మాయి హనీని బాగా చూసుకోకపోతే పరిస్థితి ఏంటి అంటాడు. అసిలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా చెప్పు అని ప్రశ్నిస్తాడు బాబాయ్. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది నా పెళ్లి గురించి కాదు భూమి పూజ గురించి అంటాడు.
Intinti Gruhalakshmi:
తరువాత సన్నివేశంలో తులసి ఒంటరిగా బాధపడుతూ ఆ కార్డును చూస్తూ ఈరోజు అభి అపార్థం చేసుకుంటున్నాడు అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది ఈరోజు కార్డుపై తులసి అని పేరు వచ్చింది రేపు మ్యూజిక్ స్కూల్ బోర్డుపై కూడా ఉంటుంది తర్వాత శిష్యుల మనసులలో వినిపించాలి అది నీ లక్ష్యం అనుకుంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.