టాలీవుడ్ ప్రేక్షకులకి యాక్టర్ సురేఖావాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి, అక్క, చెల్లి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువ అయిన నటి. అలాగే కమెడియన్ బ్రహ్మానందంకి జోడీగా కూడా చాలా సినిమాలలో కనిపించి తన నటనతో మెప్పించింది. హాస్యాన్ని అద్భుతంగా పండించే సురేఖావాణి ఎమోషనల్ సన్నివేశాలని కూడా అంతే ఈజీగా చేసి మెప్పించారు. ఇప్పటికి హీరోయిన్ తల్లి పాత్రలు సినిమాలలో చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈమె సినిమాలలో కనిపించే పాత్రలకి విరుద్ధంగా బయట మాత్రం చాలా మోడరన్ గా ఉంటుంది. తన కూతురుతో కలిసి ఇంటరెస్టింగ్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. భర్త చనిపోయిన తర్వాత సురేఖావాణి ఎక్కువగా సోషల్ మీడియా దృష్టిలో పడుతుంది.
హాట్ డ్రెస్సులుతో వివాహాయాత్రలు చేస్తూ, అలాగే కూతురుతో కలిసి షార్ట్ వీడియోలు చేస్తూ చాలా జాలీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక సురేఖావాణి కూతురు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో కూతురు సుప్రీతని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఆమె అందరి దృష్టిలో పడేలా చేస్తుంది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో సుప్రీత్ నటిగా అడుగుపెట్టింది. ఇక హీరోయిన్ గా ఆమెని తీర్చి దిద్దడానికి సురేఖావాణి కూడా మోడరన్ గా మారి ఎక్కువగా డిజిటల్ వరల్డ్ లో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక చాలా సందర్భాలలో సురేఖావాణి కూతురు సుప్రీత తన తల్లికి మళ్ళీ పెళ్లిచేస్తానని చెప్పింది. అలాగే సురేఖావాణి పెళ్ళి గురించి చాలా కాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా సురేఖావాణి తాను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే తనకి కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అనే విషయంలో మాత్రం చాలా కండిషన్స్ పెట్టింది. తనని బాగా అర్ధం చేసుకునేవాడు. హాట్ గా ఉండి తెల్లగా ఉన్నవాడు. అలాగే మంచి డబ్బు సంపాదించే వాడు అయ్యి ఉండాలని పేర్కొంది. అదే సమయంలో లైట్ గా గడ్డం ఉండి, మంచి లుక్ తో ఉన్నవాడు కావాలని, అలాంటి వాడు దొరికి బాయ్ ఫ్రెండ్ అయితే, నచ్చితే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే ఈ వయస్సులో ఈమె కోరుకున్న క్వాలిటీలతో వరుడు దొరకాలంటే కాస్తా కష్టమే అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఆమె ఆశించిన బాయ్ ఫ్రెండ్ సురేఖావాణికి దొరుకుతాడేమో చూడాలి.