ఓటీటీ పార్ట్ ఫామ్ వచ్చాక స్టార్ సెలబ్రెటీలు కూడా బుల్లితెరపై సందడి చేస్తూ సరికొత్తగా తమని తాము ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొందరు ఓటీటీ వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రేక్షకులు కొత్తదనం ఉన్న కథలు, అలాగే ఎంటర్టైన్మెంట్ ని ఎక్కువగా ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓటీటీ చానల్స్ కూడా ఆ దిశగా ఆలోచిస్తూ ప్రేక్షకులని దగ్గర చేసుకోవడానికి రకరకాల షోలని తెరపైకి తీసుకొస్తున్నాయి. వీటిలో తెలుగు ఓటీటీ ఛానల్ ఆహా ముందు వరుసలో ఉందని చెప్పాలి. స్టార్ సెలబ్రెటీలతో ప్రత్యేకమైన షోలని ఆహా ప్రేక్షకుల కోసం అందిస్తుంది. వీటిలో బాలయ్యతో మొదలుపెట్టిన ఆన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె టాక్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
బాలయ్య స్టైల్ లో సాగే ఈ షోకి విశేషమైన స్పందన వచ్చింది. సెలబ్రెటీలని తనదైన శైలిలో బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం ప్రేక్షకులకి బాగా చేరువ అయ్యింది. దీంతో చాలా కాలంగా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్య సీజన్ 2 ఉంటుందని అధికారికంగా బాలకృష్ణ, అలాగే ఆహా యాజమాన్యం కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే డేట్ అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆన్ స్టాపబుల్ షో స్టార్ట్ గురించి ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది. విజయదశమికి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడే విధంగా దశమి నుంచే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ని గ్రాండ్ గా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య చాలా కాలంగా దూరం పెరుగుతూ వస్తుంది. చాలా సందర్భాలలో బాలయ్య నేరుగా చిరంజీవిపై విమర్శలు కూడా చేశారు. ఈ నేపధ్యంలో ఈ ఆన్ స్టాపబుల్ షోతో వారి విభేదాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు అరవింద్ భావించి ఇలా సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ మెగాస్టార్ తో ప్రారంభించబోతున్నట్లు టాక్. వీరి కలయిక అంటే షోకి కూడా మంచి రేటింగ్స్ వస్తాయని గట్టి నమ్మకంతో షో నిర్మాతలు కూడా ఉన్నారు.