BJP MLA Raja Singh : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మునావర్ ఫారుఖీ షోకి అనుమతి ఇవ్వొద్దంటూ ఆయన హడావుడి చేసిన మీదట కూడా డీజీపీ అనుమతి ఇవ్వడంతో రెచ్చిపోయిన రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోను సైతం యూట్యూబ్ నుంచి తొలగించారు.
రాజాసింగ్ ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే.. ‘‘నేను హెచ్చరించినా మునావర్‌తో షో జరిపించారు, పోలీసులకు నేను ముందే దండం పెట్టి వేడుకున్నా, అయినా వినలేదు, మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో ముస్లింలంతా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట, పాత నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజాసింగ్ సమాజం మనోభావాలను దెబ్బతీశారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు.
BJP MLA Raja Singh : ప్రవక్త బట్టలూడదీస్తా..
సీతమ్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మునావర్ ఫారూఖీ షోను ఆపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేదంటే వేదిక వద్ద ఉన్న సెట్‌ను తగలబెడతానని బెదిరించారు. మునావర్‌ను కొ్ట్టి పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపులను హైదరాబాద్ పోలీసులు పట్టించుకోలేదు. మునావర్ షోకు అనుమతిచ్చారు. పోలీసుల భద్రత నడుమ షో సజావుగా సాగిపోయింది. ఆ రోజునగా రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.ఆ సమయంలోనే తాను ప్రవక్త బట్టలూడదీస్తా అంటూ రాజాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు.