Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 23వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అక్కడకు వచ్చిన శృతిని అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. పరంధామయ్యను ఎలా ఉంది తాతయ్య ఇప్పుడు అంటే సంతోషంగా ఉంది కనీసం ఈ వంకతో నైనా నన్ను చూసే అవకాశం వచ్చింది అంటాడు. తులసి ఒక్కసారైనా ఫోన్లో అయినా మాట్లాడొచ్చు కదా అమ్మ సరే నీ చేతి కాఫీ తాగాలని ఉంది అంటే సరే అంటుంది శృతి. తరువాత సన్నివేశంలో నందు లాస్య లు అనసూయ ను పక్కకు పిలిచి వైజాగ్ లో దిగిన కొన్ని అసభ్యకర ఫోటోలను చూపించి మేము ముందే చెప్పాము కదా తులసిని సామ్రాట్ గారితో వైజాగ్ పంపించవద్దు, అని ఇప్పుడు చూడు ఎలా ఉందో అంతా పరువు పోతుంది, అంటూ నందు వెటకారంగా మాట్లాడతాడు. తర్వాత లాస్య మీరు మాత్రమే ఈ ఇంట్లో అందరినీ అర్థం చేసుకొని కరెక్ట్ గా మాట్లాడతారు మీరే చూసుకోండి ఇందులో ఉంది తులసి అవునో కాదో ఏదో డాన్స్ స్కూలు బిజినెస్ అది ఇది అని చెప్పి ఇంటి పరువు వల్ల తీసేస్తుంది అంటూ ఇద్దరూ కామెంట్ చేస్తారు. ఇంకా మీరు తులసి వైపే ఉంటే మేము అటు వెళ్ళగానే ఫోటోలు చింపి పక్కన పాడేయండి. ఇంటి పరువు పోతుంది కాబట్టి మేము ఏమీ అనము రేపటినుండి ఇంటికి వచ్చే పేపర్ వాడు పాలవాడు కూరగాయల వాడు ఇలా అందరూ ముందు ఉన్న పరువు కాస్త పోతుంది. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుకుంటారో మీరే ఆలోచించండి. ఇంతటితో మా బాధ్యత తీరిపోయింది. అంటూ మేము వెళ్ళొస్తామని అక్కడి నుంచి ఇద్దరు వెళ్లిపోతారు.
తరువాత సన్నివేశంలో సామ్రాట్ కూతురు హానీ ఇంట్లో పని వాళ్లపై నీళ్లు చల్లుతూ అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్ వచ్చి కోపంగా చూసి నువ్వే నా ఆటపాటించేది. దీనిని నేను అస్సలు సహించను అంటూ తాను కూడా హనీపై నీళ్లు చల్లి అల్లరి చేస్తాడు.అప్పుడు సామ్రాట్ బాబాయి సామ్రాటేనా ఇలా చేస్తుంది అనుకుని ఆశ్చర్యపోతాడు.
తరువాత సన్నివేశంలో శృతిని పరమానందయ్య ఇంకా తులసి నువ్వులేని లోటు బాగా కనపడుతుంది అమ్మ అంటే, తులసి నీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేశాను అంటుంది. శృతి లేదా ఆంటీ నేను వెళ్ళాలి అంటే మీ అత్తయ్యకు ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదా అంటే అది అనే లోపు పరమానందయ్య మొన్న ఒకసారి వీళ్ళ అత్తయ్య మార్కెట్లో కనిపించింది అంట, అంతే ఆరోగ్యం బాగా ఉన్నట్టే కదా ఉండిపోమ్మా అంటుంది. తర్వాత శృతి అది కాదు ఆంటీ నా బట్టలు అవి అనే లోపు ప్రేమ్ నువ్వైనా చెప్పు అత్తగా నేను చెప్తే అధికారం చాలాఇస్తున్నట్టు ఉంటుంది. అదే భర్త మాట్లాడితే ప్రేమ వినిపిస్తుంది అంటుంది. తర్వాత శృతి తో నువ్వు ఇంతకు ముందులా లేవు చాలా డల్ గా ఉన్నావు అంటాడు పరమానందయ్య. అవును అంటుంది తులసి. ఏమైనా ప్రాబ్లమా చెప్పమ్మా అంటూ అంటే పరమానందయ్య మనతో లేదు కదమ్మా అందుకే వాళ్ళ అత్తయ్యకు చెప్పి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. అంటే పిచ్చి పిల్ల అంటూ తలని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
Intinti Gruhalakshmi:
తరువాత సన్నివేశంలో సామ్రాట్ తో తన బాబాయి సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడు అంటే దానిపై సీరియస్ అయి ఇలా రాయడం ఏంటి బాబాయ్. అతడు ఎవడో కనుక్కో అంటే ఇది ఆల్రెడీ సర్క్యూలేట్ అయ్యింది. వేలమంది దీని చదివారు అంటాడు. టూరిస్ట్ అక్కడ భార్యాభర్తలు వస్తారు. హాయిగా అక్కడ గడుపుతారు అని రాశాడు. అప్పుడు సామ్రాట్ ఇది తులసికి తెలిస్తే ఫీల్ అవుతుంది మన ఆఫీసు వంక కన్నెత్తి కూడా చూడదు తన మ్యూజిక్ స్కూల్ కల ఆగిపోతుంది. అంటూ బాధపడతాడు. మరొకవైపు ఈ ఆర్టికల్ ను పరమానందయ్య కు చూపించి అభి నిందలు వేసే విధంగా మాట్లాడతాడు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు. ఆల్రెడీ డాడ్ నానమ్మకు ఫోన్ చేసి చెప్పారు మామ్ ను వైజాగ్ వెళ్ళనివ్వద్దు అని ఎవరు పట్టించుకోలేదు అంటాడు. ఇప్పుడు ఏం చేయమంటావని పరమానందయ్య అడిగితే ఇంటికి పెద్ద మీరు నేను చెప్పానంటే డెసిషన్ మీరే తీసుకోండి అనే లోపు ప్రేమ్ ఎంటర్ నీకు అమ్మ మీద నమ్మకం ఉందా లేదా ముందు అది చెప్పు అంటే నీకు మొదటినుంచి ఇదే ప్రాబ్లం మామ అంటే నీ ఒక్కడికే కాదు మాకు కూడా ప్రేమ ఉంది అంటూ ఉంటే ఇంతలో తులసి ఎక్కడకు వస్తుంది తులసికి ఈ ఆర్టికల్లు చూపిస్తూ ఉండగా అక్కడకు సామ్రాట్ తులసి గారు అంటూ వస్తారు .ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి వరకు వేసి చూడాల్సిందే.