Bandi Sanjay : కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనలో ఓ అనుకోని ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. మరోవైపు విపక్ష పార్టీలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇంతకీ ఆ ఘటన ఏంటో మీకు అర్ధమై పోయే ఉంటుంది. మునుగోడు పర్యటనకు ముందు అమిత్ షా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బయటకు వస్తుండగా ఆయన వెంటే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. షా కంటే ముందు వెళ్లి ఆయన చెప్పులు తీసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీన్ని రీట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చెప్పులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఈ విషయమై స్పందిస్తూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారన్నారు. బీజేపీలో బీసీ నేత స్థానం ఏంటో చూడండి అంటూ ఠాగూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం దీనిపై స్పందించారు. బీజేపీ బానిసలను తయారు చేస్తోందంటూ అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
Bandi Sanjay : ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కు పొసగడం లేదట..
గుజరాతీ నేతలకు బీజేపీ నేతలు గులాంలుగా మారిపోయారని అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని బండి సంజయ్.. అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోయడమేంటని మండిపడ్డారు. ఇది బీజేపీ మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని అద్దంకి దయాకర్ విమర్శించారు. అయితే దీనిపై వినిపిస్తున్న మరో వాదన ఏంటంటే.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కు పొసగడం లేదని టాక్. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ఈటల సీఎం అవుతారన్న టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బండి సంజయ్ పడిపోయారని టాక్. ఈ క్రమంలోనే నేడు చెప్పులు మోసేందుకు సైతం వెనుకాడలేదని విమర్శలు వినవస్తున్నాయి.