మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీకు సంబంధించిన టీజర్ ని చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ మోస్ట్ యాంటిసిపేటేడ్ మూవి టీజర్ చెప్పిన టైం కన్నా కొంచెం డిలేగానే రిలీజ్ అయ్యింది కాని ఇంపాక్ట్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉంది. ఇక ఇప్పటి వరకు మెగాస్టార్ ని తెరపై యంగ్ లుక్ లో చూసిన ప్రేక్షకులకు మొదటిసారిగా మెరిసిన జుట్టు, మాసిన గడ్డంతో సరికొత్తగా చిరంజీవి కనిపించి మెస్మరైజ్ చేశాడు అని చెప్పాలి.
ఇరవై ఏళ్ళు ఎటు వెళ్లాడో తెలియదు, కాని వచ్చిన ఆరేళ్లలో ఎంతో పాపులారిటి తెచ్చుకున్నాడు అనే డైలాగ్ తో మొదలైన టీజర్, నయనతార సత్యదేవ్ ఎంట్రీలతో కిక్ ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ కట్ షాట్స్ పడుతున్న టైంలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపించి మెస్మరైజ్ చేశాడు. టీజర్ ఎండ్ లో సల్మాన్ ఖాన్ సూపర్ డైలాగ్ మాసివ్ లుక్ తో కనిపించి మెప్పించాడు. చిరు లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ టీజర్ లో చాలా కొత్తగా ఉన్నాయి. థమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యుజిక్ బిగ్గెస్ట్ చాలా అడ్వాంటేజ్ గా నిలిచింది. థమన్ మ్యుజిక్ కి చిరు స్వాగ్ తోడై, గాడ్ ఫాదర్ టీజర్ ని బెస్ట్ బిర్త్ డే గిఫ్ట్ గా మార్చాయి.
ఈ సినిమాలో సత్యదేవ్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ మొదటి సారిగా స్ట్రైట్ తెలుగు సినిమాలో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ఇప్పటి వరకు హిందీలో స్టార్ హీరోగా సల్మాన్ ఖాన్ ని చూసిన ప్రేక్షకులకి ఈ సినిమాలో సరికొత్తగా కనిపించడం పక్కా అనే మాట వినిపిస్తుంది. ఇక ఇండస్ట్రీ రికార్డులని తిరగరాయడానికి రెడీ అయిన ఈ టీజర్ ఈ మేరకు ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అనేది చూడాలి. ఇక ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్స్ లో హంగమా చేయడానికి రెడి అవుతున్నారు.