Munugode : కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులు ఝలక్ ఇచ్చారు. అండగా ఉంటారని భావించిన హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం వెనుకడుగు వేశాయి. నైట్‌కు నైట్ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు సీపీఐ నేతలు. అంతే నేడో రేపో తాము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామన్న ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. అండదండగా కమ్యూనిస్టులు ఉంటారని నిన్న మొన్నటి వరకూ ప్రచారం నడిచింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. కారులోనే పయనించేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. మునుగోడులో టీఎర్ఎస్‌కే సీపీఐ మద్దతు తెలిపింది.
కాంగ్రెస్ చర్చల టీమ్‌కు సీపీఐ పెద్దలు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. నిన్న రాత్రి ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. నేడో రేపో మద్దతు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రోజు మునుగోడు సభలో పాల్గొని మద్దతు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. సీపీఐ దారిలోనే సీపీఎం.. టీఎర్ఎస్‌కు మద్దతు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. నేటి నుంచి దాదాపు పార్టీలన్నీ అక్కడే తిష్టవేయనున్నాయి. టీఆర్ఎస్ కారు ర్యాలీ నిర్వహిస్తుంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
Munugode : అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ
మరోవైపు బీజేపీ.. కేంద్రం నుంచి పెద్దలను రప్పిస్తోంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొత్తానికి సమరం నువ్వా.. నేనా? అన్నట్టుగా జరగనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ అంతర్గత కలహాలతోనే ఇబ్బంది పడుతోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీకి సంబంధించి హైప్ అంటూ ఏమీ వచ్చింది లేదు. నేటి నుంచి రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అయితే నల్గొండ జిల్లాలో వామపక్ష పార్టీలకు మంచి పట్టే ఉంది. ఈ పార్టీ టీఆర్ఎస్‌తో పొత్తుకు సిద్ధమైంది కాబట్టి ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.