సెలబ్రెటీల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికంటే ఎక్కువ సంపాదన వారికే ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ సంపాదన ఇండస్ట్రీలో కోట్లలో ఉంటుంది. సక్సెస్ ఫుల్ హీరో, హీరోయిన్స్ అయితే ఒక్కో సినిమాకి 50 కోట్లకి పైగానే తీసుకుంటారు. అలాగే వారికి అడ్వార్టైజ్ మెంట్ ల ద్వారా కనీసం 50 కోట్లకి పైగానే ఆదాయం వస్తుంది. ఏ విధంగా చూసుకున్న వారి ఆదాయం సంవత్సరానికి 100 కోట్లకి పైగా ఉంటుంది. అందుకే అత్యంత విలాస వంతమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోయిన్స్ స్టార్ ఇమేజ్ వచ్చిన సంపాదించిన దాంట్లో చాలా వరకు దానధర్మాలు అంటూ తగలేసేవారు.
అయితే నేటితరం హీరోయిన్స్ ఈ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు. అనవసరమైన వాటి కోసం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం లేదు. ఒక వేళ సాయం చేయాలని అనుకుంటే ఒక చారిటీ ఈవెంట్ కండక్ట్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుని మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నారు. వారు కష్టపడి సంపాదించిన ప్రతి పైసా తమ కోసమే వాడుకుంటున్నారు. కొంత మంది వ్యాపారాలలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఇక విషయంలోకి వస్తే బాలీవుడ్ హీరోయిన్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది దీపికా పదుకునే అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె ఒక్కో సినిమాకి 15 నుంచి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటుంది.
ఇక ఆమె భర్త రణవీర్ సింగ్ కూడా 30 నుంచి 40 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి అలాంటి వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ జంట ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. గృహ ప్రవేశ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు వారు కొన్న బిల్డింగ్ ధర బిటౌన్ లో అందరికి షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఆ ఇంటి ఖరీదు 22 కోట్ల రూపాయిలు అని తెలుస్తుంది. సిటీకి కాస్తా దూరంగా ఈ ఇంటిని వారు కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబైలో ప్రభావతి ప్రాంతంలో వారికి సొంత ఇల్లు ఉంది. అయితే డీఎంఈని గెస్ట్ హౌస్ గా ఉపయోగించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.