Tejaswi : తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ఆపై హాట్ హీరోయిన్‌గా మారి బోల్డ్ రోల్స్‌తో కనువిందు చేస్తున్న తేజస్వి మదివాడ చాలా రోజుల తర్వాత `కమిట్‌మెంట్` అనే చిత్రంలో నటించింది. పేరుకి తగ్గట్టే చిత్ర పరిశ్రమలోని కమిట్‌మెంట్ల గుట్టు రట్టు చేసేందుకు వస్తోందీ బ్యూటీ. తన జీవితంలోని కొన్ని యదార్థ సంఘటనల మేళవింపుతో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి ప్రధాన పాత్రలు పోషించారు. నలుగురు జంటలకు సంబంధించిన స్టోరీయే ఈ సినిమా. నాలుగు కథలను ఈ సినిమాలో చూపించారు.
ఈ సినిమా నిన్న విడుదల కానుంది. సినిమాపై స్పందన ఎలా ఉన్నా కూడా.. ఈ బ్యూటీ చెబుతున్న విషయాలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే సినిమా విడుదలకు ముందు చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనేక విషయాలను బోల్డ్‌గా షేర్ చేసుకుంది. ఇప్పటికే టాలీవుడ్‌లోని కమిట్‌మెంట్ల గురించి చెప్పి హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కూడా హాట్ కామెంట్లు చేసింది. ఇక తాజాగా గతంలో తాను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వివరించి షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు కొంతమంది ఫుల్‌గా తాగి వచ్చి తనను అటాక్ చేశారని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎదుర్కొన్న కమిట్‌మెంట్ల గుట్టును సైతం ఈ అమ్మడు వెల్లడించింది.
Tejaswi : ఇండస్ట్రీలో చాలా మంది నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
‘ఓసారి ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి రాత్రి నన్ను అటాక్ చేశారు. నేను ఏదోలా తప్పించుకుని ఇంటికి వెళ్లి తెగ ఏడ్చాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది నన్ను కమిట్‌మెంట్ అడిగారు. కొందరు ఫోన్‌లో అడిగారు, మరికొందరి నేరుగా చూపులతోనే అడిగేవారు. అది ఈజీగా తెలిసిపోయేది. సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు. అదే ఇప్పుడు ఏదైనా జరిగితే పేరుతో సహా సోషల్ మీడియాలో అన్నీ బయటపెట్టొచ్చు’ అని తేజస్వి చెప్పుకొచ్చింది.