Anasuya : బుల్లితెరపై స్టార్ యాంకర్స్‌లో ఒకరిగా అనసూయ భరద్వాజ్ ఉంది. నాలుగు పదుల వయసుకు చేరవవుతున్నా అమ్మడు తన అందచందాలతో ఫ్యాన్స్ మనసులను దోచేస్తూనే ఉంది. ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే అనసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో వెండితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తరువాత నుంచి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ అటు వెండితెర, ఇటు బుల్లితెరపై అలుపెరగకుండా పయనిస్తోంది. అయితే అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్ అనే కామెడీ షోతో అనే విషయం తెలిసిందే.
తనకంటూ మంచి గుర్తింపును ఇచ్చిన ఆ షోకు అనసూయ ఇటీవల గుడ్ బై చెప్పేసింది. ఇక అప్పటి నుంచి అనసూయ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా అనసూయ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. దీనిలో భాగంగా రంగుల తెర వెనుక ఉన్న అసలు రంగులతో పాటు తాను జబర్దస్త్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందనే విషయాలను సైతం పంచుకుంది. తనపై వేసే పంచులు, బాడీ షేమింగ్ వల్లే తాను జబర్దస్త్‌ను వీడినట్లు చెప్పుకొచ్చింది. అనంతరం ఇండస్ట్రీలో మహిళలను ఎలా చూస్తారో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్ అంటే కెమరా ముందు కాపాడాలంటూ అరవాలి.. లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా.. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి’ అని చెప్పి షాక్ ఇచ్చింది.
Anasuya : ఈ రంగుల ప్రపంచం వేరు.. బయటకు కనిపించినంత అందంగా ఉండదు..
ఇండస్ట్రీలో తమ హక్కుల కోసం మాట్లాడితే తమను తొక్కేస్తారని అనసూయ వెల్లడించింది. హీరోయిన్ అంటే దేవదాసిలా పని చేయాలన్నట్లు చూస్తారని.. అది చాలా తప్పు అని చెప్పుకొచ్చింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అంటేనే అందరిక ఆసక్తి అని.. కానీ ఇక్కడ అందరిలాగే తాము పనిచేస్తామని వెల్లడించింది. కానీ ఈ రంగుల ప్రపంచ వేరని.. బయటకు కనిపించినంత హుందాగా ఉండదని అనసూయ తెలిపింది. అసలు అంతా దీనిలోని లోతును ఎందుకు తెలుసుకోవాలనుకుంటారని ప్రశ్నించింది. సినీ సెలబ్రెటీల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల సినిమా చూడాలనే ఆసక్తేపోతుందని పేర్కొంది. అసలు మా సినిమాలు చూసే అర్హత మీకుందా అని మేం ఆలోచించడం మొదలు పెడితే.. ఎవరొస్తారు థియేటర్‌కి’ అంటూ కాసింత ఘాటుగానే అనసూయ స్పందించింది.