Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య తొలిసారిగా బాలీవుడ్‌లోకి ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే చై నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సినిమా మాటెలా ఉన్నా కూడా.. ఈ సినిమా ప్రమోషన్స్ పుణ్యమాని చై ఇచ్చే ఇంటర్వ్యూలలో ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బాలరాజుగా చై అద్భుతంగా నటించాడని ప్రశంసలు అందుతున్నాయి. మరోపక్క చాలా నిజాయితీగా చై పంచుకుంటున్న విశేషాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. సమంత నుంచి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్ని విషయాలనూ చెప్పుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చై తన లవ్‌లైఫ్‌పై ఓపెన్ అయ్యాడు.
సమంతతో పెళ్లికి ముందు చైకి కాలేజీ రోజుల్లో ఓ లవ్‌స్టోరీ ఉందట. ఈ లవ్ స్టోరీ గురించి ఓపెన్ అవ్వడమే ఇంట్రెస్టింగ్ అంటే.. అప్పడు జరిగిన ఓ ఘటన గురించి చెప్పి మరీ ఆసక్తిని రేకెత్తించాడు. తన లవ్ స్టోరీ గురించి స్వయంగా చెప్పిన చై తన గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డానని చెప్పి షాక్ ఇచ్చాడు. తాను చేస్తున్నది తనకు తప్పనిపించలేదు కానీ పోలీసులకు అడ్డంగా దొరికి పోవడమే కాస్త ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ‘కారు వెనుక సీట్లో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు దొరికిపోయాను. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.నేను చేస్తుంది ఏంటో నాకు తెలుసు. అంతా బాగానే ఉంది కానీ పోలీసులకు దొరికిపోయాను అంటూ షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు.
Naga Chaitanya : షాక్ అవుతున్న నెటిజన్లు..
చై తన గర్ల్‌ఫ్రెండ్ పేరు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం చై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చైలో ఇలాంటి యాంగిల్ ఒకటి చూసి నెటిజన్లు సైతం రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా సమంతతో విడాకులు తర్వాత తాను చాలా మారిపోయానని గతంలో చై ఒక సందర్భంలో చెప్పాడు. అసలు ఇంతకు ముందు ఎన్నడూ కూడా చై ఓపెన్ అయ్యేవాడు కాడు. అసలు ఏ సినిమాకు కూడా ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు. ఇంతలా ఎన్నో విషయాలు పంచుకుందీ లేదు. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనూ చాలా క్లోజ్‌గా విషయాలు షేర్ చేసుకుంటున్నట్లు తెలిపాడు.