హిమని పెళ్లి కూతురిని చేస్తూ మురిసిపోతుంది సౌందర్య. కానీ హిమ మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అటు సౌర్య తన మేనత్త స్వప్న దగ్గరకి వెళ్లి నిరుపమ్‌కి హిమతోనే పెళ్లి జరుగుతుందని అక్కడే ఉన్న శోభతో కలిపి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత నిరుపమ్‌కి ఇష్టం లేకపోయినా శోభతో పెళ్లికి రెడీ చేస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 10న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నిరుపమ్‌ని పెళ్లికొడుకులా చూసి చాలా మురిసిపోతుంది స్వప్న. అదే మాట భర్తతో అని తెగసంబరపడిపోతుంది. అంతటితో ఆగకుండా నిరుపమ్ స్నేహితుడు మధుకి కాల్ చేసి.. ‘మీ స్నేహితుడు డాక్టర్ నిరుపమ్ పెళ్లికొడుకులా ముస్తాబై ఉన్నాడు. కంపెనీకి మీ ఫ్రెండ్స్‌ని తీసుకునిరా’ అని చెబుతుంది. అలాగే పెళ్లికొడుకులా నిరుపమ్‌తో ఓ సెల్ఫీ తీసుకుంటుంది స్వప్న. ఈ సీన్‌లో చూస్తుంటే స్వప్న కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తుందని అర్థం అవుతుంది.
మరోవైపు హిమ పెళ్లి కూతురిగా రెడీ కాకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సౌందర్య, ఆనందరావు ఏమైందని అడుగుతారు. అప్పుడు స్వప్న పంపించిన ఓ ఫొటోని చూపిస్తుంది. అందులో.. నిరుపమ్, శోభ పెళ్లి బట్టలలో ఉంటారు. అది చూసి వారు షాక్ అవుతారు. ‘స్వప్న అత్త బావని ఏదో మాయ చేసి శోభతో పెళ్లికి ఒప్పించింది. ఇప్పటి వరకూ ఎలాగైనా బావని ఒప్పించి సౌర్యతో పెళ్లి చేయాలనుకున్నా’ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సౌర్య ఇదంతా వింటుంది. ‘ఏంటి ఈ నాటకాలు. నాన్నమ్మ ముందు ఈ మహానటిని ఏడుపు ఆపమని చెప్పండి’ అని చెబుతుంది. అప్పుడు ఆ ఫొటోని చూపిస్తుంది సౌందర్య. అది చూసి ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. ఆ పెళ్లి జరగదు. డాక్టర్ సాబ్ పెళ్లి ఈ మహానటితోనే జరుగుతుందని సౌర్య అంటుంది. ఆ పెళ్లి జరగకుండా తను ఆపుతానని అందరినీ అక్కడి నుంచి తీసుకెళుతుంది.
అక్కడ శోభ పెళ్లి గురించి ఆలోచిస్తూ మురిసిపోతుంటుంది. ఆస్తితోపాటు సర్వాధికారాలు తనవేనని సంతోషపడిపోతుంది. తన హాస్పిటల్ అప్పులన్నీ తీర్చేయొచ్చని అనుకుంటుంది. అప్పుడే సౌర్యని కిడ్నాప్ చేసినవాడిని అక్కడికి తీసుకొస్తుంది సౌర్య అండ్ ఫ్యామిలీ. స్వప్నని పిలిచి జరిగిన విషయాన్ని వాడితోనే చెప్పిస్తారు. అయినా స్వప్న మారదు. ‘నిరుపమ్‌తో పెళ్లికి అడ్డువస్తుందని సౌర్యని శోభ కిడ్నాప్ చేయించి ఉంటుంది. ఇందులో శోభకి నిరుపమ్ మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంది’ అని సపోర్ట్ చేస్తుంది. అప్పుడు సొంతవాళ్లను దూరంగా ఉంచే నువ్వు.. ఏం కానిదానిపై ప్రేమ చూపిస్తున్నావా అంటూ స్వప్నతో వెటకారంగా మాట్లాడుతుంది సౌర్య. ఆ తర్వాత శోభ అప్పు చేసిన బ్యాంక్ అధికారులను రంగంలోకి దింపుతారు. అప్పుడు స్వప్న కళ్లు తెరుచుకొని శోభని కొట్టి ఇంట్లోంచి గెంటేస్తుంది. జరిగిన అవమానంతో సౌర్య అంతు చూస్తానని బెదిరిస్తుంది శోభ. దానికి నీలాంటి వాళ్లని చాలా మందిని చూశాం వెళ్లమంటాడు ఆనందరావు. దాంతో స్వప్నకి తను చేసిన తప్పేంటో తెలిసి మనస్సు మారుతుంది.
ఆ తర్వాత పాలు తీసుకుని బెడ్‌రూమ్‌లో ఉన్న భర్తకి పాలు ఇస్తుంది స్వప్న.. హిమకి, నిరుపమ్‌కి పెళ్లి చేద్దాం అంటుంది. అప్పుడు తన అలవాట్లు మారి చాలాకాలమైనట్లు చెబుతాడు. అంతేకాకుండా గతంలో నిత్య విషయంలోనూ తన తప్పేం లేదని చెబుతాడు. దాంతో గతంలో కొడుకు దగ్గర భర్త గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని బాధ పడుతుంది స్వప్న. తరువాయి భాగం అంటూ.. సౌర్యకి థ్యాంక్స్ చెబుతుంటాడు నిరుపమ్. అయితే అది తనకు చికాకుగా ఉందని, తనని అలా వదిలేయమని బాధగా అనడం తెలుస్తుంది. ఇప్పటికైనా హిమ, నిరుపమ్ పెళ్లి సజావుగా జరుగుతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.