ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెలుగు చిత్రాల హవా నడుస్తుంది. టాలీవుడ్ దర్శకులు, స్టార్ హీరోలు పాన్ ఇండియా కథలతో ఇండియన్ వైడ్ గా తమ హవా కొనసాగిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తే కొన్ని మాత్రం స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే మెజారిటీ సినిమాలు ఈ ఏడాది మొదటి హాఫ్ ఇయర్ లో ఫ్లాప్ లిస్టులోకి చేరిపోయాయి. హిట్స్ గురించి చెప్పుకుంటే సింగిల్ డిజిట్ కె పరిమితం అయ్యాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ హైప్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకి వచ్చిన లాంగ్ రన్ లో భారీ లాభాలు రాకపోయిన నిర్మాతల సేఫ్ జోన్ లో ఉంచాయి. ఇలా ఈ ఏడాది టాలీవుడ్ హీరోలకి అంత గొప్పగా ఏమీ నడవలేదు.
హిట్ చిత్రాలని చూసుకుంటే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే అదే స్థాయిలో రిలీజ్ అయినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మాత్రం డిజాస్టర్ అయ్యింది. భారీ హైప్ తో రిలీజ్ అయినా ఈ సినిమాలోనే ప్రేమకథ, కథనం ప్రేక్షకులని ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. ప్రభాస్ నుంచి భారీ ఏదో ఆశించుకొని వెళ్లిన వారిని పూర్తిగా నిరాశ మిగిల్చిన చిత్రంగా రాధేశ్యామ్ మిగిలిపోయింది. అయినాకూడా ఒక 400 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నిర్మాతలు సేఫ్ అయినా బయ్యర్లు మాత్రం మునిగిపోయారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో రూల్ చేసిన సినిమాలో కేజేఎఫ్ మూవీ ఒకటి. అయితే ఇది స్ట్రైట్ తెలుగు సినిమాల కేటగిరీలో కాకుండా డబ్బింగ్ మూవీ లిస్టులో చేరిపోయింది. ఇక ఈ ఫస్ట్ హాఫ్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది అంటే మేజర్ అని చెప్పాలి. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన అన్ని భాషలలో హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ఎబోవ్ ఏవరేజ్ చిత్రాలుగా నిలిచాయి.
ఇక వరుణ్ తేజ్, వెంకటేష్ కలయికలో వచ్చిన ఎఫ్3 అయితే ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా అనుకున్న స్థాయిలో రాలేదు. బంగార్రాజు మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక మెగాస్టార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆచార్య మూవీ భారీ హైప్ క్రియేట్ చేసిన ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. మెగాస్టార్ కెరియర్ లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఇక కొరటాలకి కూడా ఈ మూవీతో ఫస్ట్ డిజాస్టర్ వచ్చింది. ఇక రామ్ ది వారియర్, నాగ చైతన్య థాంక్యూ, నాని అంటే సుందరానికి సినిమాలు ఫ్లాప్ టాక్ నే తెచ్చుకున్నాయి. ఇక మిగిలిన సినిమాలు అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యాయో, ఎప్పుడు పోయాయో కూడా ఎవరికీ తెలియదు. ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.