యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న రాధే శ్యామ్ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్ థియేటర్స్ లోకి వస్తుండటంతో ఆయన అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. పలు భాషల్లో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ రాధే శ్యామ్ సినిమా విడుదల కానుండటం రెబల్ స్టార్ అభిమానుల్లో ఆతృత పెంచేసింది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు మార్చి 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది.
అలాగే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 18 నిమిషాలు గా తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ థ్రిల్ అయ్యేలా, ప్రతి సన్నివేశం విజువల్ వండర్‌గా ఉండేలా ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నారు దర్శకుడు రాధాకృష్ణ. ఈ చిత్రాన్ని మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఇప్పటికే విడుడల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మాతలుగా అత్యంత గ్రాండ్‌గా నిర్మించారు. చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ముఖ్యపాత్రలో కనిపించడం విశేషం. సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.