తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ జగన్, చిరంజీవి భేటీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం చిరంజీవికి మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి కూడా కీలకమైన భేటీ. ఇండస్ట్రీ స్థితిగతులు, ఇక్కడ పరిస్థితులు జగన్‌కు అర్థమయ్యేలా చిరంజీవి వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తుంది. కేవలం టాలీవుడ్ నుంచి చిరంజీవి మాత్రమే వెళ్లడం కొన్ని చర్చలకు దారిస్తుంది. అయితే ఈ భేటీకి చిరుతో పాటు నాగార్జున కూడా వెళ్లాల్సి ఉంది. అప్పట్లో ఓ సారి జగన్‌తో చర్చల కోసం చిరు, నాగార్జున కలిసి వెళ్లారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే సింపుల్‌గా ఈ విషయం నుంచి తప్పుకున్నాడు నాగార్జున. చిరు, జగన్ భేటీ గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు నాగార్జున. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీకి తనను కూడా రావాల్సిందిగా చిరంజీవి ఆహ్వానించాడని సీనియర్ హీరో నాగార్జున చెప్పాడు. సినిమా పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం జగన్‌తో చిరంజీవీ సమావేశం అయ్యారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను, చిరంజీవి చర్చించుకున్నామని.. వారం రోజుల కిందే జగన్‌ను కలుస్తున్నట్లు చిరు తనతో చెప్పాడని నాగార్జున ఓపెన్ అయ్యాడు. తనను కూడా రావాలని పిలిచినట్లు కూడా చెప్పుకొచ్చాడు నాగార్జున. కానీ బంగార్రాజు విడుదల ఉండటం.. ఆ సినిమా ప్రమోషన్స్.. ప్రీరిలీజ్ ఈవెంట్ వగైరా ఉండటంతో తనకు కుదరలేదని నాగార్జున తెలిపాడు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అంతా మంచే జరుగుతుందని నాగార్జున ఆశించారు. సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడాడు నాగార్జున. గతేడాది ఎప్రిల్‌లో జీవో నెం 35 తీసుకొచ్చారని.. అప్పుడే కూర్చుని సినిమా బడ్జెట్ లెక్కలు అన్నీ వేసుకున్నామని చెప్పాడు నాగార్జున. కథకు తగ్గట్లు ఖర్చు పెట్టాల్సిందే.. అలాగని పెట్టిన బడ్జెట్ తక్కువ కూడా చెప్పలేం అంటున్నాడు నాగ్. ఇప్పుడున్న టికెట్ రేట్లతో బంగార్రాజుకు సమస్య లేదని చెప్పాడు నాగార్జున. ఒకవేళ రేట్లు పెరిగితే బోనస్. సినిమా బాగోకపోతే ఎవరూ ఏం చేయలేరని చెప్పాడు నాగార్జున. రెండేళ్లుగా సినిమాలు లేకుండా ఇంట్లోనే ఉన్నానని.. మధ్యలో బిగ్ బాస్ ఒక్కటే ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు నాగార్జున. అందుకే ధైర్యం చేస్తున్నట్లు తెలిపాడు ఈయన. అన్నట్లు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన చిరంజీవి.. అక్కడి నుంచి కారులో నేరుగా సీఎం క్యాంప్ క్యార్యాలయానికి వెళ్లారు. సీఎంతో భేటీ అనంతరం.. చిరంజీవి మీడియాతో మాట్లాడారు… సీఎం జగన్ తో మాట్లాడిన విషయాలు మీడియా చెప్పారు…
ALSO READ: (Megastar)మెగాస్టార్ చెప్పిన పాయింట్స్… ముగిసిన భేటీ