బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్,కృతి సనన్ జంటగా నటిస్తున్న మూవీ ఆదిపురుష్.ప్రముఖ సంగీత దిగ్గజం అయిన టి సీరీస్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు,హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.ఇప్పటివరకు పౌరాణిక పాత్రలు వేయని ప్రభాస్ ఈ మూవీలో రాముడిగా,కృతి సనన్ సీతగా,సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించి కనువిందు చేయనున్నారు.
ఈ మూవీని హాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ వాల్ట్ డిస్నీ వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఒకవేళ ఇది నిజమైతే పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారుతారు.