ప్రస్తుతం ఓటిటి ప్రేక్షకులను అన్ స్టాపాబుల్ షోతో అలరిస్తున్న బాలయ్య ఈరోజు ఈ షోకు సంబంధించిన మరో ఎపిసోడ్ షూటింగ్ చేయనున్నారు.ఈ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ,పూరి జగన్నాథ్ పాల్గొనబోతున్నారు.గతంలో పూరి జగన్నాథ్ బాలకృష్ణతో పైసా వసూల్ మూవీ చేశారు.ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయిన మాస్ కు బాగా దగ్గరైంది.
ఆతర్వాత వీరిద్దరూ ఒక స్టేజ్ మీద కలిసింది చాలా తక్కువ.ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ ఒక వేదిక మీద కలుస్తుండడంతో సినీ అభిమానులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక విజయ్ దేవరకొండ,రష్మీక మందాన రిలేషన్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో విజయ్ ఈ షోకు హాజరవుతున్నారు.ఈ అంశంపై బాలయ్య విజయ్ ను ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.దానికి విజయ్ ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.