ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ పై రచ్చ జరుగుతుంది.తాజాగా ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన పేర్ని నాని రాష్ట్రంలో ఎవరికి,ఎవరి సినిమాలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వబోమని ఓ క్లారిటీ ఇచ్చారు.ఈ అంశంపై మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రీ తరుపు నుండి సీఎం జగన్ ను కలవడానికి గత కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు కానీ సీఎం జగన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు.
సీఎం జగన్ అసలు మెగాస్టార్ కు అప్పాయింట్ మెంట్ ఇస్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.ఈ సమస్య పై జగన్ కలవడానికి ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నిస్తుంటే వారిని జగన్ అసలు పట్టించుకోవట్లేదు.ఈ అంశంపై ఎమోషనల్ అయ్యి ఎవరైనా మాట్లాడితే వారిపై ప్రభుత్వం మాటల దాడి చేస్తుంది.