ఛలో మూవీతో కెరియర్ లో బిగ్గెస్ట్ అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య ఆతర్వాత ఒక్క హిట్ ను కూడా అందుకోలేకపోయారు.ఈ ఏడాది వరుడు కావలెను,లక్ష్య మూవీలలో ప్రేక్షకులకు ముందుకొచ్చిన నాగ శౌర్య ప్రేక్షకులను మెప్పించలేక మరో రెండు ఫ్లాప్ లను మూటగట్టుకున్నారు.
తాజాగా వరుడు కావలెను డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న జీ5 ఈ మూవీని జనవరి 7వ తేదీన ఓటిటిలోకి తీసుకొని రావడానికి రెడీ అయ్యింది.ఇక ఇదే రోజు ఆహా నాగ శౌర్య లక్ష్యను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.ఒకవేళ ఇదే నిజమైతే ఒకేరోజు ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి నాగశౌర్య రెండు చిత్రాలతో ముందుకొస్తారు.బాక్స్ ఆఫీస్ వారిలో విఫలమైన ఈ చిత్రాలు ఓటిటి ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తాయో వేచి చూడాలి.