కన్నడ ఇండస్ట్రీలో సినీ కెరియర్ ను స్టార్ చేసిన రష్మిక మందాన అనతి కాలంలో నేషనల్ క్రష్ ఎదిగింది.తాజాగా ఆమె బన్నీ తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ తో ప్రేక్షకులను అలరించి తన ఖాతాలో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం పూజ హెగ్డేకు గట్టి పోటీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ మిషన్ మజ్ను,గుడ్ బై మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తుంది.వచ్చే ఏడాది ఈ రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు,ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి.
ఈ పూజలను వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి నిర్వహించారు.ప్రస్తుతం రష్మీక మందాన చేసిన పూజకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను చూసిన వారంతా జాతకంలో ఉన్న దోషాల పరిహారం కోసం రష్మిక ఈ పూజలు చేశారని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు కెరియర్ కోసమో, పెళ్లికోసమో ఆమె ఈ పూజలు చేశారని కామెంట్స్ చేస్తున్నారు.అసలు నిజం ఏంటో రష్మీక స్పందిస్తే కానీ తెలియదు.