ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నిక అయ్యాక ఇండస్ట్రీ నుండి ఎవరు వచ్చి వారిని కలవలేదనో లేక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలనో తెలియదు కానీ మూవీ ఇండస్ట్రీ పై ప్రభుత్వం దృష్టి పడింది.మూవీ టికెట్స్ ను తగ్గించేందుకు కొత్త జీవోని తీసుకొచ్చింది.ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు సినిమా వాళ్ళ పై మరింత కక్ష సాధించడానికి పాన్ ఇండియా మూవీలు,కొత్త మూవీలు విదులయ్యే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించారనే కారణం చూపుతూ థియేటర్స్ కు తాళాలు వేస్తున్నారు.
ఇదంతా చూస్తున్న జనాలు ఇంటర్నెట్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.సినిమా టికెట్స్ ధర మీద దృష్టి సారించిన ప్రభుత్వం థియేటర్స్ లో పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ అని ప్రజల్ని దోచుకుంటున్న అంశంపై మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అలాగే ముందు ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టి మొన్న పడిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు బాగు చేయండి అని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.