బిగ్ బాస్ ఫేం అభిజిత్ మెయిన్ లీడ్ గా కనిపించిన మిర్చి లాంటి కుర్రాడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్య జైస్వాల్ కు ఈ మూవీ చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఆతర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె మూవీతో మంచి బ్రేక్ అందుకున్న ప్రగ్య జైస్వాల్ కు అశించినన్ని అవకాశాలు రాలేదు.తాజాగా బాలయ్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ మూవీ హిట్ అవ్వడంతో తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసింది.ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరోయిన్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.అందుకే ఈమె తన రెమ్యునరేషన్ ను కోటి రూపాయల దాకా పెంచింది.
బాక్స్ ఆఫీస్ రేసులో అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ అందులో హీరోయిన్ గా నటించిన ఈమెకు మాత్రం అసలు ఆఫర్స్ ఏమి రావట్లేదు.ఇది ఈమె రెమ్యునరేషన్ పెంచేనందుకు లేక మరే ఇతర కారణం వల్లనో అనేది తెలియట్లేదు.