రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కలిసి నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్.ఈ మూవీలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా కనిపిస్తుండగా,రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లాగా కనిపిస్తున్నాడు.ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్,రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్,శ్రియ ఈ మూవీలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.తాజాగా ముంబైలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కరణ్ జోహార్ సెట్స్ లో ఎక్కువ ఎవరు ఫోన్ లో ఉంటారని అడగగా దానికి రామ్ చరణ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు.దానికి ఎన్టీఆర్ ఫోన్ లో ఉండేది నేను కాదు ఆలియా భట్.ఎప్పుడూ ఫోన్ లో మరో ఆర్ తో వీడియో కాల్స్ లో బిజీగా ఉంటుంది అని ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
ఈ ఈవెంట్ ను నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన టెలికాస్ట్ చేస్తారని సమాచారం.