ఐకాన్ స్టార్ బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.బన్నీ – సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మీక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ మూవీకి తాజాగా కర్ణాటకలో ఎదురుదెబ్బ తగిలింది.
కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వర్షన్ సినిమానే ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేశారు.దీంతో బాగా హార్ట్ అయిన సినీ అభిమానులు బైకాట్ పుష్ప అంటూ అక్కడి సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వైరల్ చేస్తున్నారు.అలాగే ఇటీవల ప్రెస్ మీట్ కు అల్లు అర్జున్ ఆలస్యంగా వచ్చాడు దానిపై రిపోర్టర్స్ అసహనం వ్యక్తం చేశారు.దానికి బన్నీ సారీ చెప్పిన కానీ శాంతించిన కొందరు రిపోర్టర్స్ ఈ మూవీపై నెగిటివ్ కథనాలు ప్రచురిస్తున్నారు.ఓవర్ సీస్ లో స్పైడర్ మ్యాన్ రిలీజ్ తో ఇప్పటికే పెద్ద ఎదురుదెబ్బ తగిలిన ఈ మూవీకి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం మరింత సమస్యగా మారనుంది.