టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ ఒక ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్.ఈమె గతంలో రవీంద్ర భారతి వేదికగా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.అత్తారింటికి దారేది మూవీలో క్లాసికల్ డ్యాన్స్ కు సంబంధించిన సన్నివేశాలను త్రివిక్రమ్ ఈమె నుండి పొందిన ప్రేరణ కారణంగానే పెట్టారట.అలాంటి ఈవిడ ఈరోజు శిల్ప కళా వేదికగా సాయంత్రం 6 గంటలకు మీనాక్షి కళ్యాణం అనే నాట్య ప్రదర్శనను ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ చేయబోతున్నారు.ఈ ప్రొడక్షన్ హౌస్ లో సౌజన్య శ్రీనివాస్ నిర్మాతగా మారి కొత్త సినిమాలను నిర్మించబోతున్నారని సమాచారం.