ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ సరసన ‘బీస్ట్’ మూవీలో నటిస్తుంది.కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీలో ఇప్పటికే విజయ,పూజ హెగ్డేకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
తాజాగా ఈ విషయంపై స్పందించిన పూజ హెగ్డే ‘బీస్ట్’ మూవీ షూటింగ్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఈ మూవీ షూటింగ్ నేను హాయిగా నవ్వుకుంటూ, హ్యాపీగా పూర్తి చేశాను.నాకు షూటింగ్ చేసినన్ని రోజులూ ఏదో వెకేషన్‌లో ఉన్నట్లే అనిపించింది.హీరో విజయ్ స్టైలిష్ యాక్షన్, దర్శకుడు నెల్సన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్ళాయి అని ఆమె అన్నారు.ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది.