సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్నది.దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది.అందులో భాగంగా చిత్ర యూనిట్ ఈ నెల 12న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది.బన్నీ,రష్మీక జంటగా నటిస్తున్న ఈ మూవీలో సమంతతో తాజాగా ఒక స్పెషల్ సాంగ్ చేయించారు.
చైతూ తో డైవర్స్ తర్వాత సామ్ కనిపించే ఫస్ట్ మూవీ ఇలా సామ్ సాంగ్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.ఈ మూవీ రిలీజ్ అయ్యాక చిత్ర యూనిట్ సెకండ్ పార్ట్ షూటింగ్ కోసం కొంత గ్యాప్ తీసుకొని ఫిబ్రవరి నుండి సెకండ్ షూటింగ్ కు వెళ్ళాలని ప్లాన్ లో ఉందని సమాచారం.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఫలితం మీదే సెకండ్ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది.