సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్నది.దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది.అందులో భాగంగా చిత్ర యూనిట్ ఈ నెల 12న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది.బన్నీ,రష్మీక జంటగా నటిస్తున్న ఈ మూవీలో సమంతతో తాజాగా ఒక స్పెషల్ సాంగ్ చేయించారు.
చైతూ తో డైవర్స్ తర్వాత సామ్ కనిపించే ఫస్ట్ మూవీ ఇలా సామ్ సాంగ్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన లిరికల్ సాంగ్ ను ఈరోజు రాత్రి 7:02 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.దేవి శ్రీ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించారు.