రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో బోయపాటితో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు ఆ సమయంలో అఖండ ప్రొడ్యూసర్స్ బోయపాటికి రిస్క్ చేసి మరి అవకాశం ఇచ్చారు.సినిమాకు 5 కోట్లు తీసుకునే బోయపాటి శ్రీనుకి ఈ మూవీకి అంత ఇవ్వలేమని నిర్మాతలు చెప్పారట దీంతో దానికి ఓకే చెప్పి బోయపాటి శ్రీను షూటింగ్ కెళ్ళారట.
అనుకున్న దానికంటే మూవీ బడ్జెట్ ఎక్కువ్వడంతో ప్రొడ్యూసర్స్ బోయపాటితో నాన్ థియేట్రికల్ బిజినెస్, బాక్సాఫీస్ ప్రాఫిట్ లో షేర్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారట.ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తున్న అఖండ మూవీ మొదటి వారంలోనే 50 కోట్లు కొల్లగొట్టింది.దీంతో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రొడ్యూసర్ లు బోయపాటి శ్రీనుకు 10 కోట్ల వరకు ఇవ్వబోతున్నట్లు సమాచారం.