సుకుమార్ దర్శకత్వంలో బన్నీ,రష్మీక మందాన కలిసి నటిస్తున్న పుష్ప ధి రైస్ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.ప్రస్తుతం టాలీవుడ్ సినీ అభిమానులను అలరిస్తున్న ఈ మూవీ ట్రైలర్ పై తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గత కొద్దిరోజులుగా వివాదాలకు దూరంగా ఉంటున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా పుష్ప ట్రైలర్ ను ట్యాగ్ చేసి తెలుగులో రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి ఏమాత్రం భయపడని ఒకే ఒక్క సూపర్ స్టార్ అల్లు అర్జున్ అని,ఇలాంటి పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అని ప్రశ్నను సంధించారు.అలాగే ట్రైలర్ లో బన్నీ చెప్పిన ‘పుష్ప’ అంటే పుష్పం కాదని ఫైర్ అని డైలాగ్ జోడించి ట్వీట్ చేశారు.ప్రస్తుతం నెట్టింటా ఈ ట్వీట్ వైరల్ అవుతుంది దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.