బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ,ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన అఖండ మూవీ తాజాగా థియేటర్స్ లో విడుదలైంది.ఈ మూవీకి తమన్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.విడులైనప్పటి నుండి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ మూవీ ఫస్ట్ వీక్ లోనే 44.55 కోట్ల షేర్ ను రాబట్టింది.53.25 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సివుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించినప్పటికి,స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వనప్పటికి ఐదే జోరుని కానీ ఈ మూవీ కొనసాగిస్తే ప్రొడ్యూసర్స్ కు కాసులు వర్షం కురిపిస్తుంది.