మన దేశంలో ఈమధ్య కాలంలో డ్రగ్స్ సరఫరా,రవాణా అనేది పెరిగిపోతుంది.తాజాగా చెన్నై కస్టమ్స్ అధికారులు కార్గో ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు పంపించేందుకు సిద్ధంగా ఉంచిన 8 లక్షల విలువ చేసే మత్తు మాత్రలు, ఒక కేజీ 125 గ్రాముల విలువైన గంజాయి కొరియర్ పార్శిళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేసి పట్టుకున్నారు.
సుమారు 40 లక్షలు విలువ చేసే ఈ పార్శిళ్లను చెన్నై నుంచి అమెరికాకు తరలించే ప్రయత్నం చేసిన వ్యక్తులు కోసం ప్రస్తుతం అధికారులు అరా తీస్తున్నారు.దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్ కు సౌత్ నగరాలు హబ్ గా మారుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోనున్నాయో వేచి చూడాల్సివుంది.