ఇండస్ట్రీలో ఈ మధ్య మంచి మంచి కథలతో సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఒకేరకమైన మూస కొట్టుడు కథలని ప్రేక్షకులపైకి వదిలిన వారు ఇప్పుడు కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా అర్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో కమర్షియల్ టచ్ ఉన్నా కూడా కథని కొత్తగా చెప్పే ప్రయత్నం దర్శకులు చేస్తున్నారు. అలాంటి కథలకి హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించే చిత్రాలు ప్రేక్షకులని పలకరిస్తున్నాయి. శుక్రవారం వచ్చింది అంటే సౌత్ లో సినిమా సందడి స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం మొదటి రోజు సినిమాకి ఎలాగూ బజ్ ఉంటుంది.
మిగిలిన రెండు రోజులు వీకెండ్స్ కావడంతో సినిమా చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపధ్యంలోనే సౌత్ లో సినిమా రిలీజ్ శుక్రవారం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాయి. నాలుగు కూడా డిఫరెంట్ జోనర్ కథలు కావడం విశేషం. అయితే ఇందులో మూడు కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ని నమ్ముకుంటే ఒక సినిమా యాక్షన్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీ అయ్యింది. మంచు విష్ణు జిన్నా సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ సినిమా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఒక విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాతో రొమాంటిక్ లవ్ అండ్ కామెడీని ట్రై చేసాడు. దీనికి కాస్తా దేవుడి టచ్ ఇచ్చి ఫిలాసఫీకల్ టచ్ లో లైఫ్ కి సంబందించిన పాయింట్ ని చెప్పబోతున్నారు. ఇక శివ కార్తికేయన్ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా ప్రిన్స్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో ప్రేమికుల మధ్య లాంగ్వేజ్ కష్టాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. ఇక కార్తీ సర్దార్ సినిమా స్పై థ్రిల్లర్ గా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ప్రేక్షకుల ముందుకి వస్తున్న కథ. ఇందులో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఇలా భిన్నమైన నేపధ్యాలతో వస్తున్న నాలుగు సినిమాలపై బజ్ గట్టిగానే ఉంది. మరి వీటిలో ప్రేక్షకులకి ఏ సినిమా కనెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.