గత వారం రోజుల వ్యవధిలోనే టీడీపీ పార్టీ సభలలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘటనలు యాదృచ్చికంగా జరిగిన కూడా చంద్రబాబు మీద అధికార పార్టీ విమర్శలు చేయడం మొదలు పెట్టింది. దీనిని రాజకీయ కోణంలో టర్న్ చేసి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుంది. ఈ విషాద ఘటనలని అడ్డుపెట్టుకొని చంద్రబాబు పర్యటనలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అలాగే లోకేష్ పర్యటనపై కూడా కొన్ని ఆంక్షలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు బోగట్టా. ఇదిలా కందుకూరులో తొక్కిసలాట ఘటన మరిచిపోక ముందే గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో మహిళల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు.
అయితే చనిపోవడానికి కారణాలు ఏమైనా కూడా టీడీపీ ఆ ఘటనపై స్పందించింది. చంద్రబాబు పేరు మీదగా కానుకల పంపిణీ కార్యక్రమం ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించింది. ఈ నేపధ్యంలో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకి వారు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే పార్టీ నుంచి కూడా మరో 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే టీడీపీ నాయకులు మరో 5 లక్షల వరకు పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇలా చనిపోయిన మృతుల కుటుంబాలకి 30 లక్షల పరిహారాన్ని టీడీపీ పార్టీ అన్నిరకాలుగా అందించడానికి సిద్ధమైంది.
అయితే ఈ ఘటనలో సరైన నిర్వహణ లేకపోవడం వలన బాధ్యులుగా ఉయ్యూరు ఫౌండేషన్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అధికార పార్టీ ఈ ఘటనపై చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తుంది. బాబు చేసిన హత్యలుగా వీటిని అభివర్ణిస్తుంది. చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాయం చేసే కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు.