యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండియన్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ గా అతని స్టామినా పరిచయం అయ్యింది. బాహుబలి సిరీస్ లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలతో ఒక్కసారిగా ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తన వైబ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో ఏకంగా 2000 కోట్ల పైకి కలెక్షన్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సొంతం చేసుకొని అరుదైన రికార్డుని తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇప్పటి చాలా సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో వచ్చిన ఈ కలెక్షన్స్ ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోతోంది.
నాన్ బాహుబలి రికార్డులు అనే పేరు ఇండస్ట్రీలో బ్రాండ్ అయ్యింది అంటే దానికి కారణం బాహుబలి 2 సాధించిన కలెక్షన్స్ అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి మళ్ళీ బాహుబలి చాప్టర్ 2 రికార్డులు బ్రేక్ చేయాలని అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. మళ్ళీ ఆ రికార్డుని బ్రేక్ చేయాలంటే డార్లింగ్ ప్రభాస్ తోనే సాధ్యం అవుతుందేమో అనే స్థాయిలో తన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. నిజానికి ఆ సినిమా రొటీన్ స్టొరీనే. అంత గొప్ప టేకింగ్ కూడా కాదు. కాదు ప్రభాస్ ఇమేజ్ తో ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఏ హీరో అయినా కూడా ఆ మూవీ కచ్చితంగా డిజాస్టర్ అయ్యి నిర్మాతలకి నష్టాన్ని మిగిల్చేది కాని ప్రభాస్ కారణంగా ఆ సినిమా నిర్మాతలు సేఫ్ అయ్యారు.
అలాగే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన రాధేశ్యామ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే సాధారణ లవ్ స్టొరీలో ప్రభాస్ ని ఆడియన్స్ చూడలేకపోయారు. దీంతో కంటెంట్ బాగున్నా కూడా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. కాని ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసింది. డిజాస్టర్ మూవీతోనే ఈ స్థాయిలో కలెక్షన్ సాధించడం చిన్న విషయం కాదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా 5 భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, రాజా డీలక్స్, స్పిరిట్. ఈ సినిమాల మొత్తం బడ్జెట్ 2500 కోట్లకి పైనే ఉంది.
ఇందులో కేవలం ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ బడ్జెట్ ఏకంగా 1000 కోట్లకి పైగా ఉండటం గమనార్హం. ఇండియన్ ఇండస్ట్రీలో ఒక హీరో మీద ఇన్ని వేల కోట్ల బిజినెస్ జరగడం అంటే చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ఇక ముందు కూడా ఏ హీరో మీద ఈ స్థాయిలో బిజినెస్ జరగకపోవచ్చు. ఈ స్థాయిలో నిర్మాతలు ప్రభాస్ మీద పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారంటే అది ఇండియన్ వైడ్ గా అతని మార్కెట్ మీద ఉన్న నమ్మకం అని చెప్పాలి. దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా అంటే అవుట్ ఆఫ్ వరల్డ్ వెళ్లి ఆలోచించడానికి కారణం కూడా నిర్మాతలు సిద్ధంగా ఉండటమే అని చెప్పాలి.