నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నిఖిల్ కెరియర్ లో వంద కోట్ల గ్రాస్ మూవీగా ఈ సినిమా నిలిచిపోయింది. చిన్న బడ్జెట్ చిత్రంగా మొదలైన ఈ సినిమా ప్రస్థానం బాలీవుడ్ లో 50 స్క్రీన్స్ పై రిలీజ్ అయ్యి 1500 స్క్రీన్స్ స్థాయికి చేరుకుంది. ఏకంగా సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం హిందీలోనే వచ్చేసింది అంటే కార్తికేయ2 మూవీకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా ఈ మూవీ 25 కోట్లకి పైగా హిందీలో కలెక్ట్ చేసింది.
తెలుగుతో పాటు ఇతర బాషలలో వచ్చిన కలెక్షన్స్ వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటిపోయింది. ఇక ఈ మూవీతో నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడని చెప్పాలి. ఈ నేపధ్యంలో అతను చేయబోయే నెక్స్ట్ సినిమాలకి ఈ క్రేజ్ ఉపయోగపడుతుంది. అలాగే వాటిపై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతుంది. ఇక నిఖిల్ నుంచి కార్తికేయ 2 తర్వాత రాబోతున్న సినిమా 18 పేజెస్. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో అతని అసిస్టెంట్ సూర్య ప్రతాప్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే తక్కువ బడ్జెట్ తో ప్యూర్ లవ్ స్టోరీగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.
అయితే నిఖిల్ మార్కెట్ పరిధి పెరగడంతో దేశ వ్యాప్తంగా అతనికి క్రేజ్ ఏర్పడటంతో 18 పేజెస్ మూవీని అదే రేంజ్ లో ప్రేక్షకులకి అందించాలని సుకుమార్ కూడా భావిస్తున్నాడు. దీనికిగాను కంటెంట్ లో కొన్ని మార్పులు చేసి యూనివర్శల్ అప్పీల్ తీసుకొచ్చి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక హీరో నిఖిల్ కూడా ఈ చేంజెస్ కి ఒకే చెప్పి మళ్ళీ రీ షూటింగ్ కి రెడీ అయినట్లు సమాచారం. మరోసారి చాలా సన్నివేశాలని 18 పేజెస్ కోసం రీషూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.