శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు అనే వార్తని దెసవ్యాప్తంగా ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు…తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ కు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. ఆసుపత్రికి తీసుకుని వచ్చేటప్పటికీ.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంచినట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు.

గెలియా.. గెలియా.. అనే ఆ పాట అప్పట్లో సూపర్ హిట్ అవ్వడమే కాకా ఇక్కడ మన తెలుగు లో కూడా పునీత్ రాజ్‌కుమార్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే అసలు ఎవరు ఈ పునీత్ రాజ్ కుమార్ అనే మాట్లాడుకుంటే.. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ గారి మూడో కుమారుడే ఈ పునీత్ రాజ్ కుమార్.
మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌కు కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఒక చెయ్యి పనిచేయదు.
ఇక మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. అక్కడ కన్నడలో పునీత్ ని పవర్ స్టార్ అని పిలుస్తారు..ఇక్కడ మనం మన రావెన్ కళ్యాణ్ ని ఎలాగైతే గుండెల్లో అలాగే పునీత్ రాజ్ కుమార్ ని కన్నడ ప్రజలు దివంలా భావిస్తారు. యూత్‌లో పునీత్ కి క్రజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే…అలా అక్కడ అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన యువరత్న మూవీ తెలుగులోనూ విడుదలైంది. ఇక్కడ కూడా మంచి మూవీగా మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.

SOURCE :- india today
అయితే పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో కసరత్తు చేస్తోన్న సమయంలో సడన్ గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అంతేకాదు ఈ సమాచారం అందుకున్న వెంటనే వేలాది మంది పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన క్షేమంగా బయటికి రావాలంటూ ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసారు కానీ ఆ దేవుడు రాసిన విధిని ఈవారం ఎవరం మార్చలేం కదా… ఇక ఇప్పటికే పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ , ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, కేజీఎఫ్ ఫేమ్ యష్ ఆసుపత్రికి చేరుకున్నారు. శాండల్‌వుడ్ మొత్తం ప్రస్తుతం ఆసుపత్రి వద్దే నిలిచింది. ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
ఇక పునీత్ 1976లో బాలనటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరు. బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడి పాత్రలో నటించారు. అంతేకాదు బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి పునీత్ రాజ్‍కుమార్ పెద్దయ్యాక సినిమాల్లోకి వచ్చి 2002లో అప్పూ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నటసార్వభౌమ, చక్రవ్యూహ, రణవిక్రమ, దొడ్మనె హుడుగ, పవర్.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పునీత్ రాజ్‌కుమార్ ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.

అందులో ఆల్మోస్ట్ హిట్ సినిమాలే ఉండడం గమనార్హం…అంతేకాదు పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ పునీత్ చదవుని ఎప్పుడు పక్కన పెట్టలేదు. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు.ఇక పునీత్ గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పునీత్ అసలు పేరు లోహిత్..ఈయన 1999 లో అశ్విని రేవంత్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు..వీరికి ధ్రితి, వందిత అనే ఇద్దరు పిల్లలు వున్నారు.
టాప్ హీరోగా.. ఆయన కేరీర్ అత్యున్నత స్థితిలో ఉంది. వరుస సూపర్ హిట్స్‌తో శాండల్‌వుడ్ సినిమా స్థాయిని పెంచారాయన. ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో సడన్ గా కన్నుమూయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు ఆవేదనలో మునిగిపోయారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండేలా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఇంటి వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదిఏమైనా డెస్టినీని ఎవరు మార్చలేరు…